సీఎం కేసీఆర్ వైఖరిలో ఒక్కసారిగా మార్పు.. ఎన్నికల వ్యూహమేనా!

-

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా హుజురాబాద్‌ పేరునే కలవరిస్తున్నారు. ఈటల టీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత.. సీఎం కేసీఆర్ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఈ మార్పే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే గతంలో ఏ ఉప ఎన్నిక మీద పెట్టనంతగా హుజురాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. దీంతో సీఎం కేసీఆర్ పూర్తిగా స్టైల్ మార్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఒక రాజకీయ పార్టీగా, అధికారంలో ఉన్న ప్రభుత్వంగా హామీలు ఇస్తామన్నారు. ఇది ఎన్నికల వ్యూహంలో భాగమంటూ ఓపెన్‌గానే చెప్పారు. అంతేకాదు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒక నియోజకవర్గంపై దృష్టిపెట్టారు..!

కాగా హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షల 26 వేల 553 ఉన్నాయి. ఇందులో పురుష ఓటర్లు ఒక లక్షా 12 వేల 808 మంది కాగా. మహిళా ఓటర్లు ఒక లక్షా 13 వేల 744 మంది ఉన్నారు. నియోజకవర్గంలో కులాల వారీగా చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 22 వేల మంది ఉంవగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు 29 వేల మంది ఓటర్లు ఉన్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు 28 వేలు ఉండగా గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు 26 వేల మంది ఓటర్లు ఉన్నారు. గొల్ల కుర్మ సామాజిక వర్గానికి చెందిన వారు 25 వేల మంది ఓటర్లు ఉండగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 26 వేల మంది ఉన్నారు. ఇక దళిత ఓటర్లు 45 వేల మంది ఉండగా అందులో ఎస్టీలు 65 వేల మంది, ముస్లిం ఓటర్లు 12 వేల మంది ఉన్నారు.

 

అయితే ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. కులాల వారీగా లెక్కలు తీసి ఒక్కో కులానికి ప్రభుత్వం ఒక్కో తాయిలం ప్రకటిస్తోంది. అవి సరిపోవన్నట్టుగా సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఒక మండల స్థాయి అధ్యక్షునికి ఇచ్చారు. గెలవాలన్న సంకల్పమో..లేదంటే ఓడిపోతామనే భయమో కానీ..కేసీఆర్ పూర్తిగా హుజురాబాద్‌పైనే ఫోకస్ చేశారు. దీంతో కేసీఆర్ స్ట్రాటజీపై రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news