చిరంజీవి టు ప్రభాస్… ఈ టాలీవుడ్ హీరోలకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?

-

అబ్బా ఏమున్నాడురా.. స్టైల్​ సూపర్, లుక్​ కేక, ఇంత అందంగా ఉన్నాడేంట్రా బాబు, ఆరు పదలు వయసు వచ్చినా ఇంకా మన్మథుడులా ఉన్నాడు.. ఇవన్నీ తమ అభిమాన హీరోలు చూసి ఫ్యాన్స్ మాట్లాడుకునే మాటలు. ఎందుకంటే సాధారణంగా హీరోలు ఎప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా, ఫిట్​గా కనిపిస్తూ.. సినిమా సినిమాకు లుక్​ ఛేంజ్​ చేస్తూ మరింత గ్లామర్​గా తయారవుతుంటారు.

అయితే ఇందుకోసం డైట్​ను పాటిస్తుంటారు. ఎంతో శ్రమిస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. కసరత్తులు కూడా చేస్తుంటారు. అయితే ఈ ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మన కథనాయకులు ఎక్కువుగా ఏ ఫుడ్​ తినడానికి ఇష్టపడతారో తెలుసుకుందామా?

టాలీవుడ్​ గ్లామర్​ కింగ్​ నాగార్జున.. ఆరు పదుల వయసులో ఇంకా అందంగా కనిపిస్తూ.. యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అయితే ఆయన దోశ, చేపలు, గ్రిల్​డ్​ చికెన్​ను ఎంతో ఇష్టంగా తింటారు.

మెగాస్టార్ చిరంజీవికి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే చాలా ఇష్టమ‌ట. సీఫుడ్​తో పాటు చిరు దోశ‌లను కూడా ఇష్టంగా తింటారట.

బాలయ్య బాబు కూడా రొయ్యలను బాగా ఇష్టపడతారట‌. అలాగే చికెన్ బిర్యానీ అంటే బాలయ్యకు ఫేవరెట్ ఫుడ్! అయితే ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతానికి సంబంధించిన స్పెషల్​ ఫుడ్​ను ఆస్వాదించడం బాలయ్యకు అలవాటు అంట.

విక్టరీ వెంకటేష్ నోస్టాల్​జిక్ కీమాను ఫేవరెట్​ ఫుడ్​. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకొని నోస్టాల్​జిక్ కీమాను తినడమంటే వెంకీకి బాగా ఇష్టమట.

ప్రభాస్​ సాధారణంగా ఫుడ్​ లవర్​. ఎన్నో వివిధ రకాలు ఆహారాన్ని ఆయన ట్రై చేస్తూనే ఉంటారు. అయితే ఆయనకు ఎక్కువగా బిర్యానీ అంటే ఇష్టమట. అలానే సీ ఫుడ్​తో పాటు రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారట.

మహేశ్​ బాబు వాళ్ళ అమ్మమ్మ చేసే ప్రతి వంటనూ ఎంతో ఇష్టంగా తినేవారట. ప్రస్తుతం మహేశ్​ ఇష్టమైన వంటకాలను డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నారట.

పవర్​స్టార్​ పవన్ కళ్యాణ్​కు బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు. అలాగే పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్​తో పాటు మంచి చెఫ్ కూడా. ఇక ఆయనకు ఇష్టమైన ఫుడ్.. రోటీ, నాటుకోడి కీమా. అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటారట.

రామ్ చరణ్​కు కూడా ఫెవరేట్ ఫుడ్ బిర్యానీనే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరెట్ అంట. అయితే బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటాడు.

Read more RELATED
Recommended to you

Latest news