మేకప్ తో మతి పోగొడుతోన్న తెలుగు హీరోలు

-

టాలీవుడ్ టాప్ హీరోలు “డీగ్లామరైజ్డ్” లుక్ లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.మునుపెన్నడు లేనివిధంగా మేకప్ మ్యాటర్లో బొండరీస్ దాటి మరీ ఆలోచిస్తున్నారు.మరి మన హీరోలకు లుక్ లో ఉన్న ఇంట్రెస్ట్ ..కంటెంట్ మీద ఉందో లేదో అన్నదే అస్సలు తెలియకుండా ఉంది.

మన హీరోలకు మేకోవర్ లేనిదే మూవీ నడవదు.ఎప్పటికప్పుడు హీరోయిన్లను మించిన మేకప్ తో మెస్మరైజ్ చేయాలని చూస్తారు.ఆ ఇదితోనే ఇంతకాలం బండి నడిపించారు.మధ్యలో ఎప్పుడైనా కుదిరితే డీగ్లామరైజ్డ్ రోల్స్ చేశారు.అంతేగాని దానినే కంటిన్యూ చేయాలని ఎక్కడా చూడలేదు.చేసినంత కాలం అమ్మాయిలతో పోటీ పడుతూ మేకప్ లు వేసుకోవడం ,పార్టీలకు అటెండ్ అవ్వడంతోనే
మన హీరోల హీరోయిజం నడిచిపోయింది.

తాజాగా టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ ,మాలీవుడ్ స్టార్స్ మాదిరిగా పర్ ఫార్మెన్స్ రోల్స్ చేయాలని చూస్తున్నారు.ఇప్పటికే రంగస్థలంలో చెర్రీ మేకప్ లేకుండా పర్ ఫార్మెన్స్ చూపించి తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు.ఇప్పుడు అదే స్థాయిలో బన్నీ సుకుమార్ సినిమాలో అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు.ఇప్పటివరకు స్టయిలిష్ స్టార్ కెరియర్లో చేయని రోల్ ను మనం పుష్పలో చూడబోతున్నాం.ఈ సినిమాతో బన్నీ లేడీ ఫ్యాన్స్ ను చాలావరకు డిజప్పాయింట్ చేయెచ్చు.బట్ మాస్ లో మరింత మైలేజ్ ను కొట్టే ఛాన్స్ ఉంది.

బన్నీ ఒకవైపు పుష్ప ఫిలింతో చిరాకు చూపులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారితే..మరోవైపు విక్టరీ వెంకటేష్ నారప్ప లుక్ తో అందరికీ షాక్ ఇస్తున్నాడు.వెంకీ కెరియర్ లో ఇంతటి మాస్ లుక్ ను ఇప్పటివరకు మనం చూడలేదు.గురు సినిమాలో కోచ్ గా చేసినప్పటికీ ఆ మీసం,గెడ్డంతో సాల్ట్ పెప్పర్ లుక్ లో అదరగొట్టేశాడు.బట్ నారప్పలో అలాక్కాదు.పక్కా “రాకంటెంట్ “తో సినిమా రూపొందింది.ఈ పాత్రను ప్రేక్షకులు ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటారో తెలియని పరిస్థితి.అయినప్పటికీ తన కాన్పిడెంట్ తో తానున్నాడు.

ఒకవేల ఈ రోల్ వర్కవుట్ అయితే రానున్న కాలంలో మరింతమంది తెలుగు టాపర్లు డీగ్లామరైజ్డ్ రోల్స్ చేసే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news