నాగశౌర్య టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పక్కింటి కుర్రాడిలా అనిపించే శౌర్య.. ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య సినిమాతో ఈ హీరో అమ్మాయిల గుండెల్లో తిష్ట వేశాడు. ఇక అప్పడి నుంచి తెలుగు తెరపై దూసుకెళ్తున్నాడు. ఇటీవలే కృష్ణ వ్రింద విహారి అనే సినిమా తో హిట్ కొట్టాడు. ఆ మూవీ లవ్ పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చూపించిన శౌర్య పెళ్లి ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సహంగా ఎదురు చూశారు.
ఎప్పుడెపపుడా అని చూస్తున్న నాగశౌర్య పెళ్లి కబురు రానే వచ్చింది. ఈ నెల 20న బెంగళూర్ లో నాగశౌర్య వివాహం జరగనుంది. అనూషను నాగ శౌర్య మ్యారేజ్ చేసుకోనున్నారు. అయితే.. 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో.. ఇప్పటికే నాగ శౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది.
ఇదిలా ఉంటే.. నాగశౌర్య ఇటీవలే తన నెక్స్ట్ సినిమాను ‘NS24’ ప్రకటించారు. ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, అరుణ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.