రేపే ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..పూర్తి వివరాలివే..

ఏపీ 2022 పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు.గత రెండేళ్ళ నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు..ఈ ఏడాది జరిగిన పరీక్షలు ప్రభుత్వానికి నిరాశను మిగిలింది.అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఇక ముందు అలాంటి తప్పులను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.ఈ క్రమంలో.. జులై 6 నుంచి 15 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఆగస్టు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఫలితాలు విడుదల కానున్నాయి.బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు AP SSC Supplementary Results వెలువడిన అనంతరం https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.విజయవాడలోని లెమన్‌ ట్రీ హోటల్‌లో మంత్రి ఫలితాలను విడుదల చేస్తారు.ఫలితాలను ప్రకటించిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

జులై 6 నుంచి 15 వరకు జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలో దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా, ఆంధ్రాలో ఈసారి టెన్త్‌ ఫలితాలను గ్రేడ్‌లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్‌ పరీక్షల్లో మొత్తం 6,21,799 మంది హాజరుకాగా 414281 మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు..