రేపే “భగవంత్ కేసరి” రిలీజ్… అంచనాలు అందుకుంటుందా ?

-

నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ల కాంబినేషన్ వస్తున్న మొదటి సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా రేపు గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అవుతోంది. ఈ మధ్యనే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి చాలా అంచనాలు కలిగేలా యూనిట్ మొత్తం మాట్లాడారు. అయితే ట్రైలర్ చుసిన వరకు ఆలోచిస్తే ఒక కొత్త కాన్సెప్ట్ ను తెరమీదకు తీసుకువస్తున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ముఖ్యంగా శ్రీ లీల క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక మెసేజ్ ను ఇవ్వనున్నారు. బాలకృష్ణకు జోడీగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది.

మరి రేపు విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ? బాలకృష్ణకు హ్యాట్రిక్ అందిస్తుందా ? ఇప్పటి వరకు అపజయం ఎరుగని అనిల్ రావిపూడి మరో హిట్ ఇస్తుందా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news