పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

-

తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని సహించేది లేదని స్పష్టం చేశారు. పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన ఈ అంశంపై తాండూరులో వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారేది లేదన్నారు. ఓ మంత్రిగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు.

Patnam Mahender Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ భారీగా చేరికలు.. 20న ఆ  పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నేతలు వీరే.. | Patnam mahender reddy will join  in telangana congress-10TV Telugu

పైలట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేస్తున్నారన్నారు. తాండూరుతో పాటు కొడంగల్‌లోను పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. తమ ప్రాంతంలో కొంతమంది నాయకులు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేవారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. అయితే.. ఉమ్మడి రంగారెడ్ది జిల్లాకు చెందిన పట్నం మహేందర్ రెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉంది. ఈ సారి బీఆర్ఎస్ సిట్టింగ్ లకే టికెట్ కేటాయించడంతో పట్నం పార్టీ మారుతారంటూ ప్రచారం మొదలైంది . ఈ క్రమంలో ఆయన్ను బుజ్జగించిన సీఎం మంత్రి పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా మళ్లీ అధికారం లోకి వస్తే ఎమ్మెల్సీతో పాటుగా మంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news