భారతీయ మార్కెట్ లో కార్ల అమ్మకాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కార్ల మార్కెట్ లో విక్రయాలు జోరందుకుంటున్నాయి. కోవిడ్ తర్వాత నుంచి తమ కుటుంబం సురక్షితంగా ప్రయాణించేలా మధ్యతరగతి.. దిగువ మధ్య తరగతి కుటుంబాలు కార్లను కొనాలనే ఆశతో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే నెలకో కొత్త కారు మార్కెట్ లోకి విడుదలవుతోంది. వీటికి తోడు ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే మార్కెట్ లో ఏ కార్ ఎక్కువగా అమ్ముడవుతుందా…అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అక్టోబర్ నెల కార్ల అమ్మకాలను పరిశీలిస్తే పలు కంపెనీల కార్లు మంచి విక్రయాలను సాధించాయి. వీటిలో అమ్మకాల్లో టాప్ 10 స్థానాల్లో ఉన్న కార్లు ఏమిటో.. అక్టోబర్ నెలలో ఎన్ని యూనిట్ల విక్రయాలు నమోదు చేశాయో చూద్దాం.
1)మారుతి సుజుకి ఆల్టో – 17,389
2)మారుతి సుజుకి బాలెనో – 15,573
3)మారుతి సుజుకి ఎర్టిగా – 12,923
4)మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 12,335
5)హ్యుందాయ్ వెన్యూ – 10,554
6)కియా సెల్టోస్ – 10,488
7)మారుతి సుజుకి ఈకో – 10,320
8)టాటా నెక్సాన్ – 10,096
9)మారుతి సుజుకి స్విఫ్ట్ – 9,180
10)టాటా పంచ్ – 8,453
గతంలో టాప్ 10 జాబితాలో హ్యుందాయ్ క్రేటా స్థానం సంపాదించేది. అయితే టాటా నుంచి సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్ పంచ్ విడుదల చేసిన తర్వాత క్రేటా స్థానాన్ని పంచ్ ఆక్రమించింది. విడుదలైన నెలలోనే టాటా పంచ్ టాప్ 10 జాబితాలోకి వచ్చింది.