కుర్ర దర్శకులకు ఆఫర్లిస్తున్న టాప్ హీరోలు

-

గతంలో టాప్ హీరోలు ,సీనియర్ హీరోలతో ఏ దర్శకుడైనా సినిమా చేయాలంటే కశ్చితంగా అతను సీనియర్ డైరెక్టరే అయ్యుండాలి.చాలా రేర్ గా మాత్రమే యంగ్ డైరెక్టర్స్ కు బడాబాబులు ఛాన్స్ లిచ్చేవారు.ఐతే తాజాగా టాపర్లు మళ్లీ యు టర్న్ తీసుకున్నారేమో అనిపిస్తుంది.

ఏ సినీ పరిశ్రమలోనైనా సీనియారిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది.టాప్ హీరోలు తమ సినిమాలను సీనియర్ దర్శకుల చేతిలోనే పెడుతుంటారు.అలా అయితేనే వారు కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారని నమ్మేవారు.ఇక్కడ ఎక్స్ పీరియన్స్ కూడా కీ రోల్ పోషించేది.కుర్ర దర్శకులు వరుస హిట్లు ఇచ్చాక టాప్ హీరో ఓ ఛాన్స్ ఇస్తే తమని తాము ప్రూవ్ చేసుకునేవారు.

కుర్ర దర్శకులకు టాప్ హీరోల సినిమాలను టేకప్ చేయడం ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది.సాలిడ్ హిట్లు ఒకటి రెండు పడితే చాలు… ఇట్టే ఛాన్స్ లిచ్చేస్తున్నారు.రీసెంట్ గా వెంకీ కుడుముల వచ్చిన రెండు హిట్లను చూపించి మహేష్ తో స్టోరీ నేరేషన్ కు అపాయింట్ మెంట్ తీసుకున్నాడు.తీరా స్టోరీ చెప్పాక ప్రిన్స్ నచ్చిందని చెప్పడంతో వెంటనే బౌండెడ్ స్క్రిప్ట్ రెఢీ చేసేసాడట.ఇక ఛాన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం మహేష్ చేతిలో ఉంది.

ఇక డార్లింగ్ ప్రభాస్… సుజిత్ చేసిన ఒకే ఒక్క ఫిలిం రన్ రాజా రన్ చూసి సాహో ఇచ్చాడు.తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణకు రాధేశ్యామ్ కు వచ్చిన ఛాన్స్ జిల్ చూసి ఇచ్చిందే. ప్రభాస్ ఈవిషయంలో సీనియార్టీని చూసి కాకుండా కంటెంట్ చూసి ఆఫర్లు ఇస్తున్నాడు.

సీనియర్ హీరోలైన బాలయ్య ,నాగార్జున లు ఇదే రీతిలో అంతగా ఇమేజ్ లేని దర్శకులకు ఓ ఆఫర్ ఇచ్చి పక్కన పెట్టుకుంటున్నారు.అలా తమ కాంపౌండ్ దర్శకులుగా మార్చుకున్న యంగ్ డైరెక్టర్లలో నాగ్ కళ్యాణ్ కృష్ణకు,బాలయ్య శ్రీవాస్ కు ఛాన్ప్ లిచ్చి న్యూస్ మేకర్ అవుతున్నారు.ఐతే వీరిలో ఎంతమంది కుర్రదర్శకులు అవకాశం ఇచ్చిన హీరోలకు సాలిడ్ హిట్ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news