బ్రేకింగ్ : మావోయిస్ట్ అగ్రనేత ప్రశాంత్ బోస్ అరెస్ట్

-

మావోయిస్ట్‌ అగ్రనేత, సీపీఐ మావోయిస్టులకు రెండో కమాండ్‌గా ఉన్న ప్రశాంత్‌ బోస్‌ అరెస్ఠ్‌ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం… జార్ఖండ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. మావోయిస్ట్‌ అగ్రనేత ప్రశాంత్‌ బోస్‌ పై గతంలో కోటి రూపాయల రికార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నో ఏళ్లు గా అగ్రనేత ప్రశాంత్‌ బోస్‌… పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే.. తాజాగా అగ్రనేత ప్రశాంత్‌ బోస్‌ ను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రశాంత బోస్‌ తో పాటు ఆయన భార్య షీలా మరాండి కూడా అరెస్ట్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయలేదు. మరికాసేపట్లోనే దీనిపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. కాగా… సీనియర్ మావోయిస్టు నాయకులలో ఒకరైన ప్రశాంత్‌ బోస్‌ 2004లో CPI (మావోయిస్ట్) ఏర్పాటుకు CPI-ML (పీపుల్స్ వార్)లో విలీనం కావడానికి ముందు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI) చీఫ్‌గా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల హక్కుల కోసం ఆయన పోరాట చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news