మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. దీనిలో మొత్తం 146 ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో పని చెయ్యాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.45 లక్షలు శాలరీ ఉంటుంది. ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూస్తే.. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేష్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన వారు అర్హులు.
అప్లై చేసే సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజు పే చెయ్యాలి. దరఖాస్తుకు డిసెంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు కనుక ఈ లోగ అప్లై చేసుకోండి. ఈ ఖాళీలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో అభ్యర్థుల మార్కుల ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది.
ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. కెమికల్ ఇంజినీరింగ్ 8, సివిల్ ఇంజినీరింగ్ 12, కంప్యూటర్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 21, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 3, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ 32, మెకానికల్ ఇంజినీరింగ్ 65. నోటిఫికేషన్ లింక్: https://www.oil-india.com/Document/Career/Online_Advertisement.pdf
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.