జూలైలో ఓటీటీలో రిలీజయ్యే బడా మూవీలివే….

-

తెలుగులో ఉన్న అనేక ఓటీటీల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొదటి వరుసలో ఉండేది మల్టీ నేషనల్ కంపెనీలయిన అమోజాన్, నెట్ ప్లిక్స్ లతో పాటు తెలుగు వ్యక్తులకు చెందిన ఆహా, స్పార్క్ కూడా దుమ్మురేపుతున్నాయి. అలాగే జీ గ్రూపునకు చెందిన జీ5 కూడా విభిన్నమైన కంటెంట్ తో తమ సబ్ స్ర్కైబర్లను అలరిస్తూ వస్తోంది. కరోనా కంగారు మూలాన పెద్ద పెద్ద స్టార్లు నటించిన మూవీలు కూడా ఈ రోజుల్లో ఓటీటీల బాట పడుతున్నాయి. అలా ఈ నెలలో తెలుగులో రిలీజయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం…

కుడి ఎడమైతే…

అమలాపాల్ బోల్డ్ సన్నివేశాల్లో నటించిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ఈ నెల 16 వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో స్ర్టీమ్ కానుంది. కుందనపు బొమ్మ సమంత నటించిన యూ– టర్న్ లాంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపు దిద్దుకుంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండగా… స్టార్ హీరోయిన్ అమ్మడు అమలాపాల్, రాహుల్ విజయ్, ఈశ్వర్ రాచిరాజు, ప్రదీప్ రుద్ర, సూర్య శ్రీనివాస్ లాంటి వాళ్లు నటించారు. ఈ వెబ్ సిరీస్ తారాగణంలో మన తెలుగు ప్రేక్షకులకు కేవలం అమలాపాల్ మాత్రమే సుపరిచితురాలు. ఆమె మూవీలో బోల్డ్ గా నటించిన తర్వాత ఈ బ్యూటీ చేస్తున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ చూస్తుంటే ఆసక్తి గా ఉండడంతో ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలే ఉన్నాయి. సైకాలజీ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో జూలై 16 వరకు వేచిచూడాలి.

నారప్ప…

అమోజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధమవుతున్న మరో తెలుగు మూవీ నారప్ప. విక్టరీ వెంకటేష్, అందాల తార ప్రియమణి లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ అమోజాన్ ప్రైమ్ వేదికగా జూలై 24 నుంచి స్ర్టీమ్ కానుంది. నారప్ప సినిమా తమిళ హిట్ మూవీ అసురన్ కు రిమేక్ గా రూపొందుంతుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news