టికెట్ ధరల విషయమై ఏపీ ప్రభుత్వంతో చిరు బృందం చర్చలు జరిపింది.సవరించిన ధరలు అతి త్వరలోనే అమల్లోకి రానున్నా యి.అంటే చిరు బృందం చేపట్టిన చర్చలన్నీ సఫలీకృతం అయి ఈ వారంలోనే ఒక జీఓ విడుదల అవ్వనుంది.అదేవిధంగా చిరు అనుకున్న విధంగా చాలా మార్పులు ఇండస్ట్రీలో రానున్నాయి.వీళ్లంతా విశాఖ కేంద్రంగా పరిశ్రమను నడిపేందుకు చర్యలు తీసుకోనున్నారు.అదే జరిగితే ఇండస్ట్రీ అటు హైద్రాబాద్లోనూ ఇటు ఆంధ్రాలోనూ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులలో ఎవరు బెస్టు అన్న వాదన కూడా వినిపిస్తోంది.తమకు ఎన్నడూ అనుగుణంగా ఉండే సర్కారు ఆ రోజు ఈ రోజు తెలంగాణే అని కొందరు అంటున్నారు.టికెట్ల విషయంలోనే కాదు థియేటర్ల నిర్వహణలోనూ తమకు అంతో ఇంతో సహకరిస్తున్నది టీ సర్కారు మాత్రమేనని చెబుతున్నారు.జగన్ తో పోలిస్తే కేసీఆర్ ఎన్నో విధాలుగా తమకు సాయం అందించారని, అందిస్తున్నారని అంటున్నారు.
తాజా చర్చల నేపథ్యంలో జగన్ కాస్త దిగివచ్చారు.అదేవిధంగా చిరు బృందం చేపట్టిన చర్యలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. అదేవిధంగా విశాఖకు ఇండస్ట్రీని బదిలీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఐదో షో కు సంబంధించి చిన్న సినిమాలను ఆదుకునే విషయమై కూడా జగన్ హామీ ఇచ్చారు.కానీ ఇండస్ట్రీ పెద్దలు ఇవన్నీ ఓ దార్లోకి రావడానికి ఆర్నెల్లు మనోవ్యధను చూశారు.అంతేకాదు ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఆందోళనను అనుభవించారు. పలు దఫాలు జగన్ వర్గాలతో మాట్లాడి చిరు తో సహా ఇంకొందరు సమస్య పరిష్కారానికి సానుకూలంగా మాట్లాడి ఆఖరికి ఓ ముగింపు ఇచ్చారు. ఏ విధంగా చూసుకున్నా ఇంత డ్రామాను కేసీఆర్ నడపలేదు.జగన్ నడిపి తన మాట నెగ్గించుకున్నాడు. ఏ విధంగా చూసుకున్నా కేసీఆర్ చాలా హుందాగా ఉన్నారు. కానీ జగన్ మైండ్ గేమ్ ఆడారు అన్నది ఓ వాస్తవం. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా…!