పదేళ్లయిన మోహన్ లాల్ ను వెంటాడుతున్న అక్రమ రవాణా కేసు..

-

మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ ను దాదాపు 10ఏళ్ల నుంచి ఒక అక్రమ రవాణా కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతాలను ఉంచుకున్నారని కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తుంది. అయితే తాజాగా ఈ విషయంలో మోహన్ లాల్ కు కొంత ఊరట కలిగిందనే చెప్పాలి..

 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతాలను ఉంచుకున్నారన్న కేసు ఇప్పటికీ కోర్ట్ లో నడుస్తూనే ఉంది. అయితే ఈ కేసును కొట్టేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెరుంబవూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సర్కారు చేసిన ఈ విజ్ఞప్తిని మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ మోహన్లాల్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పట్లో మోహన్ లాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. అయినప్పటికీ ప్రస్తుతం పెరుంబవూరు కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వాదనను కోర్టు పాక్షికంగా అంగీకరించింది. అలాగే మోహన్ లాల్ పై కేసును కొట్టివేయాలన్న రాష్ట్ర సర్కారు విజ్ఞప్తిని పునః పరిశీలించాలని మేజిస్ట్రేట్ ను ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు మోహన్ లాల్ కు కొంత ఉపశమనం కలిగించాయని చెప్పాలి

అయితే అసలు విషయం ఏంటంటే.. దాదాపు పదేళ్ల క్రితం మోహన్లాల్ ఇంట్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ సమయంలో మోహన్ లాల్ ఇంట్లో రెండు ఏనుగు దంతాలు బయటపడ్డాయి. అయినప్పటికీ దీనిపై ఐటి శాఖ ఎలాంటి కేసును నమోదు చేయలేదు. కానీ కేరళ అటవీ శాఖ అధికారులు మాత్రం సూపర్ స్టార్ మోహన్ లాల్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ఏనుగు దంతాలు ఇంట్లో ఉంచుకున్నారు అంటూ కేసును నమోదు చేశారు. ఈ సమయంలోనే కేరళకు చెందిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై మోహన్ లాల్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తన మీద నమోదైన ఈ కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ మోహన్లాల్ కోర్టును ఆశ్రయించారు.. అయితే ఇద్దరు వ్యక్తులు నమోదు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంతో అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్న కేసులో థర్డ్ పార్టీ జోక్యం తగదంటూ అప్పట్లో ట్రైల్ కోర్టు విచారణను తోసిపుచ్చింది. దీంతో వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ వాదనలు వినటానికి అనుమతించింది. అనంతరమే రాష్ట్ర సర్కారు ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరగా కోర్టు మాత్రం రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తిని కొట్టివేసింది. ఆ తర్వాత మోహన్ లాల్ హైకోర్టును ఆశ్రయించగా ఈ విషయంపై తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..

Read more RELATED
Recommended to you

Latest news