కులాన్ని, మతాన్ని మరీ నీచంగా మాట్లాడిన సీఎం..!

-

త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి నోరు జారారు.. గతంలో మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్ టీవీలు ఉన్నాయని.. చదువుకున్న యువతీ యువకులు ఆవుల్ని పెంచాలని… లేదంటే పాన్‌ షాప్‌ పెట్టుకోవాలని  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విప్లవ్ దేవ్. తాజాగా మరోసారి కులాన్ని, మతాన్ని ఉద్దేశిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. .

“హర్యానాలో జాట్లు ఆరోగ్యంగా ఉంటారే తప్ప… బుర్ర సరిగా పనిచెయ్యదు. అందుకే బెంగాల్ ప్రజలు తెలివైన వారనే గుర్తింపు దేశమంతా ఉంది” అని విప్లవ్ దేవ్ అనడం తీవ్ర దుమారం రేపుతోంది. అలాగే పంజాబీలను కూడా ఉద్దేశించి మాట్లాడారు ఆయన. దీంతో పంజాబీలు, జాట్లకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఫైర్ అయ్యారు. బీజేపీ సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. బీజేపీ నేతల ఆలోచనలు ఇలాగే ఉంటాయంటూ… విప్లవ్ దేవ్ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్పందించాలని డిమాండ్ చేశారు.

కాగా, దీనిపై విప్లవ్ దేవ్ స్పందిస్తూ.. ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని మంగళవారం ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పంజాబీలు, జాట్లను చూసి తాను గర్విస్తానని, వారితో కలిసి తన జీవిత పయనం సాగిందని చెప్పుకొచ్చారు. ‘ ఈ రెండు వర్గాల్లో నాకు పలువురు స్నేహితులున్నారు..నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించాలని వేడుకుంటున్నా..దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబీ, జాట్‌ సోదరుల పాత్రను నేను ఎప‍్పటికీ గౌరవిస్తుంటా..ఆధునిక భారత నిర్మాణంలో వీరి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం తాను ఎన్నడూ ఊహించబోన’ని విప్లవ్‌ దేవ్‌ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news