పవన్ రీమేకి కి త్రివిక్రమ్ సాయం?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండగా మరో నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా పనులు చకచకా జరుగుతున్నాయట. ఇప్పటికే తెలుగు వెర్షన్ స్క్రిప్టుని పూర్తి చేసిన సాగర్ చంద్ర, నటీనటుల వేటలో పడ్డాడని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి త్రివిక్రమ్ సాయం చేస్తున్నాడని అంటున్నారు.

ఈ రీమేక్ కి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నాడని వినబడుతుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ బజ్ నిజమైతే అభిమానులు పండగ చేసుకుంటారు. గతంలో జయంత్ సి పరాన్జీ దర్శకత్వం తీన్మార్ సినిమాకి కూడా త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ తో పాటు నటించే మరో హీరో ఎవరా అని అందరూ ఎదురుచూస్తున్నారు. రానా అయితే బాగుంటుందని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.