బాల‌య్యా భ‌లే చెప్పావ‌య్యా..! సోష‌ల్ మీడియా ట్రోల్స్‌

-

టీడీపీ నాయ‌కుడు, అన్న‌గారి పుత్ర‌ర‌త్నం, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్న‌.. ఎప్పుడు ఎక్క‌డ నోరు విప్పినా సంచ‌ల‌న‌మే. ఆయ‌న ఏం మాట్లాడినా.. భారీ ఇంట్ర‌స్ట్! ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్య‌లే చేశారు బాల‌య్య‌. రెండు రోజులు జ‌రిగిన ఆన్‌లైన్ మ‌హానాడు ముగింపు రోజు బాల‌య్య‌.. హైద‌రాబాద్ నుం చే ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ అధికారంలోకి వ చ్చేందుకు ఐదేళ్లు ఆగాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అదేస‌మ‌యంలో.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండదన్నారు.. టీడీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుంద‌ని, అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణమని.. చెప్పుకొచ్చారు.

అంత‌టితో ఆగ‌కుండా.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఉందా.. లేదా అనే అనుమానం వస్తోంద‌ని చెప్పుకొచ్చారు. తన అవసరం ఎక్కడుంటే అక్క డ ప్రత్యక్షమవుతానన‌ని చెప్పారు. ఎన్టీఆర్ వారసులు తాము కాదని.. టీడీపీ కార్యకర్తలేన‌ని నొక్కి వక్కాణించారు. టీడీపీకి కార్యకర్తల పెద్ద బలమని.. తెలుగు దేశంకు ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేర న్నా రు. తన తుది రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే తన జీవితం అంకితం అన్నారు. తెలుగు దేశం పార్టీ సేవకే తన జీవితం అంకితమని.. ఈ అరాచక పాలన అంతానికి 5ఏళ్లు అవసరం లేదు. ప్రజలే అరాచకశక్తులకు తగిన బుద్ధి చెబుతారని బాల‌య్య చెప్పుకొచ్చారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్ల‌కు కూడా బాల‌య్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు తాను ముందుకు వ‌స్తాన‌న్న బాల‌య్య‌.. వ‌ల్ల‌భ నేని వంశీ.. చంద్ర‌బాబును ఇష్టానుసారంగా మాట్లాడిన‌ప్పుడు.. పార్టీని విడిచి పెడుతున్న‌ప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అదేస‌మ‌యంలో సొంత నియోజ‌క‌వ‌ర్గం హిందూపురంలో క‌నీసం త‌మ‌కు పింఛ‌న్లు కూడా ద‌క్క‌డం లేద‌ని నాలుగు సంవ‌త్స‌రాలుగా మొర‌పెడుతున్న ప్ర‌జ‌ల‌కు బాల‌య్య ఏం చేసిన‌ట్టు. పైగా అధికారంలోకి వ‌చ్చేందుకు ఐదేళ్లు కూడా అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

ఏడాది కింద‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న టీడీపీ.. వ్యూహాన్ని ప‌టిష్టం చేసుకునే కార్యాచ‌ర‌ణ ఎక్క‌డ బాలయ్యా? పార్టీని ఏనాడైనా ముందుకు న‌డిపించేలా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చావా? ఎంత సేపు ఆవేశం, ఆ క్రోశం త‌ప్ప‌.. నువ్వు చేసింది ఏమైనా ఉందా? అధికారంలో ఉండ‌గా.. అయిన దానికి, కాని దానికి కూడా ప‌న్నుల నుంచి మిన‌హాయింపు పొంది.. ప్ర‌జాధ‌నాన్ని జేబుల్లో వేసుకున్న విష‌యం ఇంకా మ‌రిచిపోలేద ‌ని సోష‌ల్ మీడియా వ్యాఖ్య‌లు నిప్పులు చెరుగుతున్నాయి. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌ధాన డిమాండ్ అయిన ప్ర‌త్యేక హోదాపై ఇప్ప‌టి వ‌ర‌కు కూడా బాల‌య్య స్పందించ‌క‌పోవ‌డంపైనా సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. బాల‌య్య వ్య‌వ‌హార శైలిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. మ‌రి వీటిని ఎలా చూస్తారో.. ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news