Son of India : ఆస్కార్ విన్నింగ్ గ్రాఫిక్స్ అంటూ.. మోహ‌న్‌బాబు జ‌య జ‌య‌ పాట‌పై ట్రోల్స్

-

టాలీవుడ్ అగ్ర హీరో.. మోహ‌న్ బాబు చాలా రోజుల తర్వాత మేక‌ప్ వేసుకుని స‌న్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. కాగ ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మోహ‌న్ బాబుకు ట్రోల్స్ బాధ త‌ప్ప‌డం లేదు. ఇక సినిమా విడుద‌ల అయినప్పుడు మాత్రం.. సోషల్ మీడియా ఓపెన్ చేయ‌గానే.. మోహ‌న్ బాబు స‌న్ ఆఫ్ ఇండియా పై ట్రోల్స్ క‌నిపించేవి. అయితే తాజా గా మ‌రోసారి మోహ‌న్ బాబు ట్రోల్స్ కు గురి అవుతున్నాడు.

ఇటీవ‌ల ఆదిత్య మ్యూజిక్.. త‌న సోషల్ మీడియాలో జ‌య జయ మ‌హావీర ఫుల్ సాంగ్ ను విడుద‌ల చేశారు. దీంతో మోహ‌న్ బాబు.. ట్రోల‌ర్స్ కి దొరికిపోయాడు. ఈ పాటను చూసి నెటిజ‌న్లు.. రూ. 1.8 కోట్ల గ్రాఫిక్స్ తో చేసిన పాట ఇదేనా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీనికి రూ. 1.8 కోట్లు ఎందుకు రూ. 10 వేల‌తో తీస్తా అని ఒకరు.

మ‌రి కొంద‌రు అయితే.. ఫ్రీగా ఈ గ్రాఫిక్స్ ను చేయ‌వ‌చ్చు అని కామెంట్స్ పెడుతున్నారు. మ‌రి కొంద‌రు అయితే.. ఆస్కార్ విన్నింగ్ గ్రాఫిక్స్ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మోహ‌న్ బాబు సినిమాలు తీసి ప‌రువు తీసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫేస్ బుక్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాటకు 4,300 పైగా మంది రియాక్ట్ అయ్యారు. అందులో దాద‌పు 2,000 మంది స్మైలీ గానే రియాక్ట్ అయ్యారు. అలాగే యూట్యూబ్ లో కూడా ఈ పాటపై ట్రోల్స్ వ‌స్తున్నాయి. హాలీవుడ్ స్థాయి సాంగ్ అంటూ యూట్యూబ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news