‘బీఆర్ఎస్’గా జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ !

-

ఇవాళ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే తన పూర్తి ప్రసంగాన్ని కొనసాగించారు. అలాగే జాతీయ రాజకీయాలపై కూడా ఆయన స్పందించారు. దేశంలో మార్పు రావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితిని… భారతీయ రాష్ట్ర సమితి గా మార్చాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాసం రాశాడని… ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దేశంలో కొత్త రాజకీయ శక్తి వస్తుందని వెల్లడించారు సీఎం కేసీఆర్.

బీజేపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని తనను కమ్యూనిస్ట్ పార్టీలు కోరాయని..అది చెత్త ఎజెండా నేను మీతో రాను అని చెప్పానని కేసీఆర్ అన్నాడు. దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదని… ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని ఆయన అన్నారు. గద్దెనెక్కించాల్సింది భారతదేశ ప్రజలనని.. పార్టీలను కాదని కేసీఆర్ అన్నారు. రిలీఫ్ కావాల్సింది ప్రజలుకు పార్టీలకు కాదని…మారాల్సింది ప్రభుత్వాలు కాదు, ప్రజల జీవితాలు అని కేసీఆర్ తెలిపారు. ఎవరినో గద్దెనెక్కించడానికి… దించడానికి ప్రయత్నాలు జరగాలా.? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news