రవితేజ తనయుడు హీరో గా ఎంట్రీ?

-

రవితేజ తన తనయుడు మహాదన్ ను హీరోగా పరిచయం చేయనున్నాడని టాక్ బలంగా వినిపిస్తుంది.అనిల్ రావిపూడి దర్శకత్వం లో రవితేజ చేసిన” రాజా ది గ్రేట్” సినిమా భారీ విజయాన్ని సాధించింది.ఆ సినిమాలోనే రవితేజ తనయుడు మహాదన్ కూడా కనిపించాడు.అదే అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహాదన్ హీరోగా పరిచయం కానున్నాడు అనేది తాజా సమాచారం. రవితేజ, శ్రీకాంత్..ఈ ఇద్దరు కూడా ఇలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన వారే.అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోలు అనిపించుకున్న వారే.శ్రీకాంత్ ఇప్పటికే తన తనయుడు రోషన్ ను హీరోని చేశాడు.

లుక్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న రోషన్..మరో ప్రాజెక్టు తో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.అయితే రవితేజ కుమారుడితో అనిల్ రావిపూడి ఒక యూత్ ఫుల్ స్టోరీని చేయాలనుకుంటున్నాడట.కాలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరోగా మహాధన్ అయితే బాగుంటాడని భావించి, రవితేజను సంప్రదించాడట..అందుకు రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు.త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news