బాలికపై అత్యాచార కేసులో టీఆర్ఎస్ నేత సాజిద్ పై చర్యలు… పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం

-

బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ పై టీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్ది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 

ఇటీవల ఓ మహిళ సాయంతో హైదరాబాద్ కు తీసుకువచ్చిన 16 ఏళ్ల బాలికపై షేక్ సాజిద్ అత్యాచారానికి పాల్పడ్డాడు షేక్ సాజిద్. అమ్మాయి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు బాలికను బెదిరించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాజాగా ఈ ఆరోపణలు నేపథ్యంలో సదరు నేతపై టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news