హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ఎంత వేడివేడిగా జరిగిందో… అదే తరహాలో నే ఈ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఉపఎన్నిక కౌంటింగ్… ప్రారంభం అయినప్పటి నుంచి… 11 రౌండ్ల వరకు ఉత్కంఠ భరితంగా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్, ఎనిమిదో రౌండ్ మినహా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది.
అయితే తాజాగా 11 రౌండు కౌంటింగ్ వచ్చేసరికి మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పదకొండు రౌండు లో ఈటల రాజేందర్ పై 367 ఓట్ల మెజారిటీని సంపాదించారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్. టిఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్న జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోనీ ఓట్లను ప్రస్తుతం కౌంటింగ్ చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీకి కాస్త ఆధిక్యం లభించింది.
అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై.. 52 64 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్. మరో నాలుగు రౌండ్లు టిఆర్ఎస్ పార్టీ లీడింగ్ సంపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
హుజురాబాద్: 11 రౌండ్ల ఫలితాలు… బీజేపీ 48,588 ఓట్లు, టీఆర్ఎస్ 43,324 ఓట్లు. 11 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 5,264 ఓట్ల ఆధిక్యం.