చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రూట్ మార్చాడు. ఇప్పటి వరకు చెస్ లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన విశ్వనాథన్ ఆనంద్.. ఇక తన ఆలోచనలతో ప్రత్యర్థులను మట్టికరిపించనున్నాడు. కాగ ఆసియా గేమ్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సిద్దం అవుతుంది. ఆసియా గేమ్స్ లో పాల్గొనే చెస్ టీం కు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను మెంటర్ నియమిస్తు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది.
ఈ ఆసియా గేమ్స్ లో భారత్ మెరుగైన ఫలితాలు, పతకాలు సాధించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఆసియా గేమ్స్ లో భారత ఆటగాళ్లు నాలుగు స్వర్ణాలు సాధిస్తారాని తాము నమ్ముతున్నామని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కి చెందిన అధికారి తెలిపారు. అయితే వీరికి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను మెంటర్ గా నియమిస్తే.. భారత ఆటగాళ్లుకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కాగ వచ్చే గురువారం నుంచి చెస్ ఆటగాళ్లతో విశ్వనాథన్ ఆనంద్ తొలి సేషన్ తీసుకుంటారని తెలిపారు.