ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు కొంత మందికి అందుబాటులో ఉండటంలేదు. ప్రధానంగా స్థానిక నాయకత్వానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలలో ధైర్యం అనేది కనబడటంలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో కొంతమంది నేతలు అందుబాటులో లేకపోవడం ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
ఆ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మృతి తర్వాత చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇక నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో స్పష్టత లేక చాలా మంది దూరంగా ఉన్నారు. ఇక ప్రజల్లోకి వెళ్ళే నేతలు టికెట్ కోసం హైదరాబాదు లోనే ఎక్కువగా ఉండటంతో చాలా వరకు కూడా ఆసక్తికర చర్చలు జరిగాయి.
దీనితో రాజకీయంగా ఇప్పుడు పరిస్థితులు కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ మీద గట్టిగా ఫోకస్ చేసి పాదయాత్రలు చేస్తున్నది. టిఆర్ఎస్ పార్టీ నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన నెలకొంది. పరిస్థితులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అవుతాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధానం ఎంత మాత్రం కరెక్ట్ కాదని ప్రజల్లోకి వెళ్లకపోతే పార్టీ ఓటమి పాలైన సరే ఆశ్చర్యం లేదని అంటున్నారు.