అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఇప్పుడు తీవ్ర విమర్శలకు వేదికగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా ఉండి దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నా సరే ఆయన తీసుకునే నిర్ణయాలు వ్యవహారశైలి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అమెరికాలో కరోన వైరస్ ఇప్పుడు మూడు లక్షలకు దగ్గరగా ఉన్నాయి. ఇవి రాబోయే 20 రోజుల్లో పది లక్షలు అయినా సరే ఆశ్చర్యం లేదు.
ఇవి ఇంకా పెరిగితే మరణాలు పెరుగుతాయి. కాని అతను మాత్రం మెట్రో రైల్ గాని, పలు రాష్ట్రాల విమాన సర్వీసులను గాని ఏ మాత్రం రద్దు చేయడం లేదు. ఇక ఇప్పుడు కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. అమెరికాలో కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ దిగజారింది. ఇప్పుడు ఇంకా దిగజారితే అమెరికా మరింత పతనం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని ట్రంప్ లో భయం మొదలయింది.
దీనితో ఆ దేశం ఇతర దేశాలకంటే ఆర్ధికంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని అప్పుడు చైనా పెద్దన్న అవుతుంది అనేది ట్రంప్ లో ఉన్న ప్రధాన భయం. అందుకే ఇప్పుడు అతను రద్దు చేయడం లేదు. అక్కడ రాష్ట్రాల మధ్య ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే న్యూయార్క్ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే ట్రంప్ వెనక్కు తగ్గడం లేదు.