ఐసోలేషన్ వార్డ్ లో అర్ధనగ్నంగా రోగులు…!

-

దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ విస్తరించడానికి ప్రధాన కారణం ఢిల్లీ మత ప్రార్ధనలు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. వాళ్ళ వలన ఎక్కువగా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు వాళ్లకు చికిత్స చేస్తున్న వైద్యుల విషయంలో కూడా చిరాకుగా ప్రవర్తిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లో కీలక ఘటన చోటు చేసుకుంది. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తబ్లిగ్ జమాత్ సభ్యులు అర్దనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధించిన ఘటన వాస్తవమేనని ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ విచారణలో గుర్తించారు. క్వారంటైన్ లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఆసుపత్రిలో అర్దనగ్నంగా తిరుగుతూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని,

వాళ్ళు ఫాంట్ లేకుండా తిరిగారని పోలీసులకు ఒక నర్స్ ఫిర్యాదు చేయగా దానిపై విచారణ చేపట్టిన పోలీసులు నిజమే అని తేల్చారు. ఇక వారిపై తీవ్ర నేరాభియోగాలు నమోదు చేసారు పోలీసులు. పోలీసులు జమాత్ సభ్యులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 269, 270, 271, 294, 354 కింద కేసు నమోదు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డ్ లో జాయిన్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news