తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీ పాస్ విషయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లోనే అమల్లో ఉన్న టీఎస్ బీ పాస్ ను.. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధ పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఎస్ బీ పాస్ ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని పురపాలక, పంచాయితీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమీశ్ కుమార్ సమావేశం అయ్యారు.
టీఎస్ బీ పాస్ ను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు అయ్యేలా చూడాలని సూచించారు. అందుగు తగిన చర్యలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బీ పాస్ గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం వల్ల అవినీతికి తావు ఉండదని అన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణాలకు త్వరగా అనుమతులు వస్తాయని అన్నారు. అలాగే రాష్ట్రంలో జనన, మరణాలు వంద శాతం నమోదు అయ్యేలా చూడాలని అన్నారు. ఇవి ఆసుపత్రులు, శ్మశాన వాటికల వద్ద కూడా నమోదు జరగాలని అన్నారు.