పీఆర్సీ కమిటీ నియామకం.. మధ్యంతర భృతి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

-

దసరా పండుగకు ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీని (పీఆర్సీని) నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్‌ శివశంకర్‌ (రిటైర్డ్ ఐఎఎస్), సభ్యుడిగా బీ రామయ్య (రిటైర్డ్ ఐఏఎస్) సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఆరు నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించింది.

Sri K. Chandrashekar Rao

పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. 5శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 శాతం ఐఆర్ ప్రకటించడంతోపాటు, పీఆర్సీ ప్రకటన కూడా వెలువడటంతో ఉద్యోగ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పీఆర్సీ కమిటీ ప్రకటన వెలువడే అవకాశం లేదు. నోటిఫికేషన్ రేపో మాపో అనుకుంటున్న టైమ్ లో పీఆర్సీ కమిటీ ప్రకటన విడుదల కావడంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీ అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news