తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్‌ విడుదల

-

తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖ, ఆయుష్ విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిది. 156 వైద్యుల పోస్టుల భర్తీకి గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 వైద్యుల పోస్టులను భర్తీ చేయబోతున్నది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

State Emblem and Symbols of Telangana

విద్యార్హతలు:
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) కోసం ఆయుర్వేదంలో డిగ్రీ కలిగి ఉండాలి.
మెడికల్ ఆఫీసర్ (హోమియో) కోసం హోమియోలో డిగ్రీ ఉండాలి.
మెడికల్ ఆఫీసర్ (యునాని) కోసం కోసం యునానిలో డిగ్రీ కలిగి ఉండాలి.

వయస్సు: దరఖాస్తుదారులు కనీస వయస్సు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి. 01/07/2023 నాటికి గరిష్ట వయసు 44 ఏండ్లకు మించకూడదు

ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500/ చెల్లించాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కింద దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 200/ చెల్లించాలి.
తెలంగాణలోని ఎస్ సి , ఎస్ టి , బిసి , ఈడబ్ల్యూఎస్ , పిహెచ్ & తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news