కొత్త వేరియంట్ ఒమైక్రాన్ అత్యంత ప్రమాదకరమైందన్న ప్రాథమిక అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పర్యవేక్షణకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు కే.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలను కమిటీ సభ్యులుగా నియమించింది.
ఒమైక్రాన్ బయటపడిన దేశాల నుంచి వచ్చే వారిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి వచ్చిన వేరియంట్ ఏదో నిర్ధారణ అయ్యేవరకు అక్కడే ఉంచుతురు. రెండుసార్లు కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే డిశ్చార్జ్ చేస్తారు. దక్షిణాఫ్రికా, బోట్సావానా, హాంకాంగ్, ఇజ్రాయెల్, సింగపూర్, జింబాబ్వే, న్యూజిలాండ్ మారిషస్, బ్రెజిల్, యూకే తదితర దేశాల నుంచి వచ్చే వారికి కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.
harishrao