ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ కు కొత్త సీఈవో వచ్చాడు. 6 ఏళ్ల పాటు ట్విట్టర్ కు సీఈవో గా చేసిన జాక్ డోర్సీ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జాక్ డోర్సీ సీఈవో నే కాకుండా.. ట్విట్టర్ ఫౌండర్ ల లో ఒక్కరు కూడా. జాక్ డోర్సీ తో పాటు నోహ్ గ్లాస్, బిజ్ స్టోన్ , ఇవాన్ విలియమ్స్ కలిసి 2006 లో ట్విట్టర్ ప్రారంభించారు. అప్పటి నుంచి 2015 వరకు ట్విట్టర్ సీఈవో గా డిక్ కోస్టాలో ఉండేవాడు. 2015 ను జాక్ డోర్సీ సీఈవో గా ఉన్నాడు. ప్రస్తుతం జాక్ తప్పుకోవడం తో కొత్త సీఈవో గా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ ఎంపిక అయ్యాడు.
ఇప్పటి వరకు పరాగ్ అగర్వాల్ ఒక ప్రధాన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు. అలాగే టెక్నికల్ స్ట్రాటజీ తో పాటు మరి కొన్ని బాధ్యత లలో కొనసాగారు. అయితే జాక్ డోర్సీ సీఈవో బాధ్యత ల నుంచి తప్పుకోవాలని ఎలియట్ మేనేజ్ మెంట్ కార్ప్ సూచించింది. ప్రతి సమావేశం లో జాక్ ను తప్పుకోవాలని ఎలియట్ మేనేజ్ మెంట్ తెలిపింది. జాక్ డోర్సీ ట్విట్టర్ కు ఎక్కువ సమయం కేటాయించడం లేదని ఆరోపించింది. అంతే కాకుండా ట్విట్టర్ అభివృద్ధి కి జాక్ చేసింది కూడా ఏమీ లేదని కూడా ఆరోపించింది. దోంతో జాక్ తన పదవీ రాజీనామా చేశారని తెలుస్తుంది.