నల్గొండ పోలీసులు అదుపులో 14 మంది కరోనా అనుమానితులు

-

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళలోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనా మరణాలు సంఖ్య 10 వేలు దాటింది. 117 దేశాల్లో కరోనా వ్యాపించినట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే భారత్ లో కూడా కరోనా బాధితులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటోంది.

కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియా వాసులకు కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో విదేశీలయులు పర్యటించిన ప్రాంతాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న 14 మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్ గాంధీ అసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరి రక్త నమూనాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు…

అయితే ఇప్పటి వరకూ రాష్ట్రంలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ఆసుపత్రుల్లో చేరిన 47 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఎయిర్ పోర్టుల్లోనూ, చెక్ పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో విదేశీలయులు కనిపిస్తే తమకు సమచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఇండోనేషియా పర్యాటకుల్లో 8 మందికి కరోనా సోకటం, వారంతా కరీంనగర్ లో పర్యటించడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు….

Read more RELATED
Recommended to you

Latest news