తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడానికి సిద్ధం అవుతుంది. 83 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. కాగ ఉద్యోగాల భర్తీ పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. అతి త్వరలోనే పలు శాఖల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్తులు తప్పని సరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ నిబంధన పెట్టింది.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చే ఓటీఆర్ ఐడీ తోనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసు కునే అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే ఓటీఆర్ ఐడీ తో కొద్ది నిమిషాలల్లోనే దరఖాస్తు అవుతాయని ప్రకటించింది. ఇప్పటికే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కొత్త జిల్లాల ప్రకారం మార్పులు చేసుకోవాలని సూచించింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాక ముందే.. ఈ మార్పులు చేసుకోవాలని సూచించింది.