మాలీవుడ్ స్టార్ హీరోస్ పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘జనగణమన’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్.. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ పై సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
బుధవారం చిత్ర ట్రైలర్‌ను మూవీ యూనిట్.. ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీరాజ్ నేరస్థుడిగా, సూరజ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ట్రైలర్‌లో పదవిలో ఉన్న ఓ రాజకీయ నాయకుడిని కలిసేందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ వెళ్లగా వారి మధ్య సంభాషణను ట్రైలర్ రూపంలో విడుదల చేశారు.
పెన్సన్ ఇప్పించాలని నాయకుడిని కలిసేందుకు వచ్చిన వృద్ధుడు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో లంచ్ టైంలో బయటకు వెళ్లిపోతాడు. ఆ టైంలో పృథ్వీరాజ్ నాయకుడి వద్దకు వెళ్లగా, వ్యవస్థకు ఎదురెళ్లితే జరిగేది ఇదే అంటూ పృథ్వీరాజ్ ను ఉద్దేశించి అంటాడు. కాలుకు దెబ్బ తగలడంతో తీవ్రగాయాలతో ఉన్న పృథ్వీరాజ్ అలా లోపలికి వెళ్తాడు. పోలీసుల క్రూరత్వం వలన తనకు నష్టం కలిగిందని, కావున పరిహారం ఇప్పించాలని కోరతాడు.
అప్పుడు నాయకుడు ఓకే చెప్తాడు. అయితే, వ్యవస్థకు ఎదురుతిరిగితే ఎవరూ ఎదురు నిలబడరని, నీతి, నిజాయితీ, న్యాయం అన్ని ఉట్టిమాటలేనని చెప్తాడు రాజకీయ నేత. ఎందుకో తెలుసా అని అడగగా .. ఈ దేశంలో నోట్లు నిషేధించొచ్చని, అవసరమైతే ఓట్లు కూడా నిషేధించొచ్చని ఎందుకంటే ఎవరూ అడగరు..కారణం ఇది ఇండియా అని పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్స్ సొసైటీని రీ థింక్ చేయించేలా ఉన్నాయి.
ప్రజెంట్ సిస్టమ్ లో వేళ్లూనుకుపోయిన సమస్యలను ‘జనగణమన’ చిత్రంలో ప్రస్తావించబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టత వస్తోంది. ట్రైలర్ చివరలో పృథ్వీరాజ్ సుకుమారన్ తన నట విశ్వరూపం చూపించారు. రాజకీయ నాయకుడితో మాట్లాడిన క్రమంలో అక్కడ బాంబు పెట్టి బయటకు రాగానే బాంబు పేల్చినట్లు ఉన్న ట్రైలర్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ చిత్రం వచ్చే నెల 28న విడుదల కానుంది. ఫిల్మ్‌కు శరిస్ మహ్మద్ స్టోరి అందించారు. వెరీ ఇంటెన్స్ ట్రైలర్, సూపర్ హిట్ గ్యారెంటీ, సొసైటీని ఆలోచింపజేసే చిత్రం ఇది అని ట్రైలర్ చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
“If the deaf are to hear,
the sound has to be very loud!”
– Bhagat Singh
Presenting, the trailer of #JanaGanaManahttps://t.co/sfX0EJFDXA@PrithviOfficial #SurajVenjaramoodu @Dijojose007 @mamtamohan @SDsridivya #SupriyaMenon #ListinStephen @JxBe @PrithvirajProd @magicframes2011 pic.twitter.com/vS2NuwzRQr— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 30, 2022