తెలంగాణ ఆర్టీసీ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అయితే.. ఆర్టీసీలో పీఆర్సీ డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉందని.. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఇవ్వలేకపోతున్నామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ స్పష్టం చేశారు. ఇప్పటికే కార్మికులకు 5 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు బాజిరెడ్డి గోవర్థన్. వచ్చే ఆదాయం బకాయిలకే సరిపోతోందన్నారు బాజిరెడ్డి గోవర్థన్. కొత్త బస్సులు వచ్చే వరకు కార్మికులు ఓపికతో ఉండాలని బాజిరెడ్డి గోవర్థన్ కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చామని తెలిపారు బాజిరెడ్డి గోవర్థన్.
సకల జనుల సమ్మె సమయంలో జీతాలు రాని వారికి రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నామని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. ఫెస్టివల్ అడ్వాన్స్ రూ.20 కోట్లు, ఎరియర్స్ రూ.20 కోట్లు చెల్లిస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపోతే… మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందునే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వరాలు గుప్పిస్తోందని, ఎన్నిక అయిపోయాక వాళ్లను పట్టించుకునే నాధుడే ఉండడని బాజిరెడ్డి గోవర్థన్ పలువురు విమర్శిస్తున్నారు.