మహిళలకు శుభవార్త తెలిపిన టీఎస్‌ఆర్టీసీ

-

హైదరాబాద్‌ నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీఎస్‌ఆర్టీసీ TSRTC శుభవార్త తెలిపింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రతతో పాటు వారు రాత్రి పూట ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు పడకుండా మహిళలకు సురక్షితమైన ప్రయాణం అందించేలా మంచి నిర్ణయం తీసుకుంది. నగరంలో రాత్రి 7.30 గంటల తర్వాత మహిళలు ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ బస్సు ఆగేలా, అలానే ఎక్కడ బస్సు దిగాలనుకున్న అక్కడ బస్సు ఆగేలా చర్యలు తీసుకుంది టీఎస్‌ఆర్టీసీ.

 టీఎస్‌ఆర్టీసీ/TSRTC)
టీఎస్‌ఆర్టీసీ/TSRTC)

మంగళవారం నుంచి ఇది అమలు కానుందని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయంలో మహిళలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా 9959226160, 9959226154 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకోవాలని ఈడీ వెంకటేశ్వర్లు కోరారు. ఇక నగరంలో ప్రధాన బస్ స్టాపుల్లో రాత్రి 10 వరకు బస్సుల నియంత్రణ అధికారులుండేలా కూడా ఆర్టీసీ చర్యలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news