ఒడిశాకు TSRTC బస్సులు.. ఓఎస్‌ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం

-

తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం వీలైనన్న రకాలుగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతుకుతున్నాయి. ఇప్పటికే పార్శిల్ సేవలు, స్లీపర్ బస్సులు, వివిధ ఆఫర్లతో ఆదాయా మార్గాలు వెతికిన టీఎస్ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓఎస్​ఆర్టీసీతో ఒప్పందం టీఎస్​ఆర్టీసీ కుదుర్చుకుంది.

హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, భద్రాచలం నుంచి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపేలా టీఎస్‌ఆర్టీసీ, ఓఎస్‌ఆర్టీసీల మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు.. ఓఎస్‌ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణకు నడపనున్నాయి.

ఇందులో హైదరాబాద్‌-జయపుర మధ్య రెండు, ఖమ్మం-రాయగడ రెండు, భవానీపట్న-విజయవాడ (వయా భద్రాచలం) రెండు, భద్రాచలం-జయపుర మధ్య నాలుగు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడపనుంది. నవరంగ్‌పూర్‌-హైదరాబాద్‌ మధ్య నాలుగు, జయపుర-హైదరాబాద్‌ రెండు, భవానిపట్న-విజయవాడ(వయా భద్రాచలం) రెండు, రాయగడ-కరీంనగర్‌ రెండు, జయపుర-భద్రాచలం మధ్య మూడు సర్వీసులను ఓఎస్‌ఆర్టీసీ నడపనుంది.

Read more RELATED
Recommended to you

Latest news