Breaking : ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1320 కోట్లు

-

కరోనా ప్రభావం వల్ల 2020, 2021లో తిరుమల క్షేత్రంలో తీవ్ర ఆంక్షల వల్ల భక్తులు పెద్దగా రాలేకపోయారు. 2022లో ఆ పరిస్థితి లేదు. ఆంక్షల ఎత్తివేతతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి హుండీ కూడా అదే స్థాయిలో కళకళలాడింది. ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సంవత్సరం ఇప్పటిదాకా స్వామివారిని 2.35 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని… 1.08 కోట్ల మంది భక్తుల తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారని… 11.42 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ వివరించింది. ఇదిలా ఉంటే.. నేడు తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.

TTD Lands For Sale : Jagan Faces Ire

శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. శుక్రవారం వేంకటేశ్వర స్వామిని 63,253 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,490 మంది. తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా టీటీ రూ.5.16 కోట్ల ఆదాయం లభించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news