యాదాద్రిపై 152 సీసీ కెమెరాలు.. ప్రారంభించిన రాచకొండ సీపీ

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి ఆలయంలో మరింత భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న కొండపై రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలను శుక్రవారం రాచకొండ సీపీ మహేశ్​భగవత్ ప్రారంభించారు. దీంతో యాదగిరి కొండతో పాటు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 152 కెమెరాలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.

CCTV control centre inaugurated at Yadagirigutta police station

ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు, రింగు రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాలు, యాగశాల, పుష్కరిణి, వ్రత మండపం, సీఆర్వో, బస్ స్టాండ్, గండిచెరువు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈవో గీతారెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి, సీఐలు సైదయ్య, నవీన్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news