Twitter Logo : మళ్లీ మారిన ట్విటర్ లోగో.. మూడ్రోజుల తర్వాత గూటికి చేరిన పిట్ట

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో పెనుమార్పులు తీసుకువచ్చారు. అయితే తాను తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు ట్విటర్​లో నెటిజన్లతో కాసేపు చర్చించేవారు. కొన్నిసార్లు వారి నిర్ణయం కూడా అడిగే వారు. అలా ఓ నెటిజన్ ఇచ్చిన కొంటె సమాధానానికి ఫిదా అయిన మస్క్.. ఏకంగా ట్విటర్ లోగోనే మార్చేశారు. ఆ విధంగా ట్విటర్ పిట్ట కాస్త.. ట్విటర్ కుక్కగా మారింది.

అయితే తాజాగా ఎలాన్ మస్క్ ట్విటర్ లోగోను మరోసారి మార్చారు. ఇటీవల పిట్ట లోగోను మార్చి ఆ స్థానంలో క్రిప్టో కరెన్సీ అయిన ‘డోజీ కాయిన్‌’ కు సంబంధించిన ‘డోజీ’ మీమ్‌ను లోగోగా పెట్టిన మస్క్ తాజాగా ఆ స్థానంలో మళ్లీ పిట్టను తీసుకువచ్చారు. దీంతో మూడు రోజుల తర్వాత పిట్ట మళ్లీ సొంత గూటికి చేరినట్లైంది.

కాగా, పక్షి స్థానంలోకి డోజీ మీమ్‌ రావడంతో మస్క్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క్రిప్టోలో ఎలాన్‌ మస్క్‌కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని.. అందువల్లనే డోజీ మీమ్‌ను ట్విటర్‌ లోగోగా మార్చారంటూ నెటిజన్లు విమర్శించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం లోగోను మార్చినట్లు వివరణ ఇచ్చుకున్నారు మస్క్‌.

Read more RELATED
Recommended to you

Latest news