భారత్​లో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతాపై నిషేధం

-

పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ట్విటర్ ఖాతా భారత్​లో నిషేధానికి గురైంది. @GovtofPakistan ఐడీతో ఉన్న వెరిఫైడ్ హ్యాండిల్​ను ట్విటర్​ భారత్​లో నిలిపివేసింది. పాక్ ఐడీని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.. లీగల్ డిమాండ్​లకు అనుగుణంగా భారత్​లో ఈ ఖాతాను నిలిపివేసినట్లు సందేశం కనిపిస్తోంది. దీంతోపాటు రేడియో పాకిస్థాన్ ట్విటర్ ఖాతా కూడా నిషేధానికి గురైంది. @RadioPakistan పేరుతో ఉన్న ఈ ఐడీని ఓపెన్ చేసినా.. అదే మెసేజ్ కనిపిస్తోంది.

బీబీసీ పంజాబీ హ్యాండిల్​ను ట్విట్టర్ బ్లాక్ చేసింది. లీగల్ డిమాండ్ల కారణంగా భారత్​లో ఆ ఖాతాను నిలిపివేసినట్లు తెలిపింది. అయితే, ఖాతా నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరి నుంచి అభ్యర్థన వచ్చిందనే విషయాన్ని ట్విటర్ వెల్లడించలేదు. ఖలిస్థానీ అనుకూల నేత అమృత్​పాల్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం జరగడం చర్చనీయాంశమైంది. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ట్వీట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news