కొద్దిరోజులు ట్విట్టర్ బ్లూటిక్ ఇష్యూ హాట్ టాపిక్‌గా ఉంది. ఆదాయం పెంచుకుందామని బ్లూటిక్ ప్రీమియ సర్సీసుగా చేస్తే.. అది కాస్తా లేనిపోని చిక్కులు తచ్చిపెడుతుంది. అనుకున్నదొక్కడి.. అయినదొకటి.. అన్నట్లు.. బ్లూటిక్‌ను ప్రీమియం సర్వీసుగా మార్చగానే ఫేక్ అకౌంట్స్ పెరగడంతో చిక్కుల్లో పడింది సంస్థ.. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎలాక్‌మస్క్ చేతిలో పడిన తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే దిశగా బ్లూటిక్‌ను ప్రీమియం సర్వీసుగా మార్చేశారు మస్క్. ఆదాయం పెరగడం సంగతి అలా ఉంచితే కొత్త చిక్కులు వచ్చి పడ్డాయని ట్విట్టర్ వర్గాలు తలపట్టుకున్నాయి.
ఇప్పటి వరకూ ప్రముఖుల ఖాతాలను వెరిఫై చేసి బ్లూటిక్ ఇచ్చేవారు. దీంతో ఫేక్ అకౌంట్లను కట్టడి చేసే అవకాశం ఉండేది. ట్విట్టర్‌లో బ్లూ టిక్ అంటే అది అఫీషియల్స్‌కు మాత్రమే ఇస్తారని ఒక నమ్మకం ఉండేది. అది ఉంటే ఒక లెవల్.. సాధారణ వ్యక్తులకు బ్లూటిక్ ఉండదు.. అకౌంట్‌కు బ్లూటిక్ ఉంది అంటే.. వారు ఎందులోనే ప్రావిణ్యులు అని అర్థం.. కానీ ఇప్పడు ఈ సర్వీసును ప్రీమియంగా మార్చి నెలకు 8 డాలర్ల ఫీజు పెట్టగానే చాలా మంది దర్జాగా డబ్బు కట్టి బ్లూటిక్ పొందుతున్నారు.
ఈ అకౌంట్లో చాలా వరకూ నకిలీవేనని తెలుస్తోంది. ఫేక్ అకౌంట్స్ ఒక్కసారిగా పెరగడంతో బ్లూటిక్ ప్రీమియం సర్వీసులను నిలిపివేయాలని ట్విట్టర్ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు ట్విట్టర్ యాజమాన్యం ట్విటర్ ఎలాన్ మస్క్ చేతిలో పడ్డప్పటి నుంచీ అందులో హేట్ స్పీచ్ పెరిగింది. విద్వేషపూరిత కామెంట్స్ పెరిగిపోయాయని ‘సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్’ అనే సంస్థ వెల్లడించింది.
నల్లవారిపై, ట్రాన్స్‌జెండర్ల మీద విపరీత వ్యాఖ్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో విద్వేష వ్యాఖ్యాలను కట్టడి చేయడం ట్విట్టర్ యాజమానాన్యానికి సమస్యగా మారింది. కాగా విద్వేషపూరిత కామెంట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని ట్విట్టర్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బ్లూటిక్ సమస్య బోలెడు సమస్యను తెచ్చిపెట్టింది. ట్విట్టర్ ఆదాయం పెంచుకోవడానికి ఇలా చేసి ఉండాల్సింది కాదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ చేసినా.. ఇలాంటి వారికి బ్లూ కాకుండా వేరే రంగు ఇచ్చినట్లైతే.. గుర్తుపట్టడానికి వీలుండేది. కానీ అది అట్టర్‌ఫ్లాప్ ఐడియాగా ఉంది.! మీరేమంటారు..!