మెగా అభిమానులకు బిగ్‌ అప్డేట్‌.. లీక్‌ చేసిన దేవిశ్రీ

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా వాల్తేర్ వీరయ్య. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ కు ఇటీవలే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. కాగా, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన అప్ డేట్ అందించారు. వాల్తేర్ వీరయ్య ఫస్ట్ సాంగ్ చూశానని, మైండ్ బ్లోయింగ్ అని వెల్లడించారు. ఈ పాటలో చిరంజీవి ఎనర్జటిక్ గా డ్యాన్స్ చేశారని వెల్లడించారు దేవిశ్రీ. ఈ వార్తను లీక్ చేయకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని దేవిశ్రీ తెలిపారు. వాల్తేర్ వీరయ్య నుంచి ఫస్ట్ సింగిల్ ఈ వారంలో రిలీజ్ అవుతుందని తెలిపారు.

వాల్తేరు వీరయ్య' నుంచి మాస్ నెంబర్.. ఫ్యాన్స్ కు పూనకాలే.. అప్డేట్ ఇచ్చిన  రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్!

అభిమానులూ… పార్టీకి రెడీగా ఉండండి… ఎందుకంటే ఇది బాస్ పార్టీ అని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. కాగా, ఈ పాట సినిమాలో చిరు ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ హుషారైన పాటలో మెగాస్టార్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా నటించింది. ఈ పాటను ఇటీవలే హైదరాబాద్ నగర శివార్లలో ప్రత్యేక సెట్ వేసి చిత్రీకరించారు. ఐటెం సాంగ్స్ అంటే దేవిశ్రీ ఎంత కిర్రెక్కించే ట్యూన్లు ఇస్తాడో తెలిసిందే. దాంతో వాల్తేర్ వీరయ్య ఫస్ట్ సింగిల్ పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.