సోషల్ మీడియా అప్లికేషన్స్ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. తద్వారా తమ ఖాతాల్లోకి మరింత మంది వినియోగదారులు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంటాయి. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్ ( Twitter ) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ట్వీట్టర్ మరో ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే లాగిన్ ఫీచర్. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఈ నయా ఫీచర్ ద్వారా ట్విట్టర్ వినియోగదారులు ఇకపై యాపిల్ ఐడీ లేదా గూగుల్ ఖాతా ద్వారా కూడా ట్విట్టర్‌కు లాగిన్ అవ్వచ్చు. ప్రస్తుతం ఈ వెర్షన్ కేవలం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటు ఉంది. అతి త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
కానీ, వినియోగదారులు తమ గూగుల్ లేదా యాపిల్ ఖాతాలు ట్విట్టర్‌తో అనుసంధానం చేసిన ఈమెయిల్ ఐడీలు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఈ వివరాలను ట్వీట్టర్ అధికారిక యంత్రాంగం ట్వీట్టర్ ద్వారా తెలిపింది. గూగుల్ లింక్ చేసిన అకౌంట్‌తో ట్విట్టర్ యాప్, ట్విట్టర్ వెబ్ రెండూ ఉపయోగించవచ్చు. గూగుల్ ఖాతాతో లాగిన్ అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ యాప్, వెబ్ బ్రౌజర్లలో ట్విట్టర్‌ను ఉపయోగించుకునే వీలుంది. దీని ద్వారా సైన్ అప్ ప్రక్రియ చాలా సులభతరమైంది. కేవలం ఈమెయిల్ అడ్రస్, పాస్ వర్డ్, పేరు, యూజర్ హ్యాండిల్ ఎంచుకుంటే సరిపోతుంది.
కొత్తగా సైన్ అప్ అవ్వాలనుకునేవారికి ఇవన్నీ ట్విట్టర్ హోమ్ పేజీలోనే కనిపిస్తాయి. కానీ, యాపిల్ అకౌంట్ లింక్ చేస్తే మాత్రం కేవలం ఐఓఎస్ డివైజెస్‌లో మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ నయా ఫీచర్‌తో ట్వీట్టర్ ఇతర తమ పోటీ యాప్‌లకు చెక్ పెట్టనుంది.