జపాన్ దేశ రాజధాని టోక్యో వేదికగా విశ్వ క్రీడా సంబురం ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. కాగా, ఈ పోటీల్లో తమ దేశ జెండా ఎగురవేసేందుకుగాను వివిధ దేశాల క్రీడాకారులు శ్రమిస్తున్నారు. ప్రపంచంలో ఒలింపిక్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రీడాభిమానులు అందరూ ఒలింపిక్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. టోక్యో ఒలింపిక్స్‌లో గెలుపు సంగతి పక్కనబెడితే కనీసం పార్టిసిపేట్ చేస్తే చాలు అని భావించే వారు బోలెడు మంది ఉండటం మనం గమనించొచ్చు.
ఈ క్రమంలోనే భారత్ తరఫున బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు రెండు పతకాలు సాధించి ఇండియా పేరు నిలబెట్టింది. గతంలో జరిగిన ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ గెలుచుకున్న తెలుగు తేజం సింధు ఈసారి కాంస్య పతకం సాధించి దేశ పతాకాన్ని ఎగురవేసింది. ఈ క్రమంలో దేశ ప్రజలు ఆమె గురించి గొప్పగా చెప్పుకుండటం మనం చూడొచ్చు. అయితే, కొందరు వెరీ ఇంట్రెస్టింగ్‌గా పీవీ సింధు వ్యక్తిగత వివరాలపై సెర్చ్ చేశారు. అవేంటంటే..
గూగుల్‌లో పీవీ సింధుపీవీ సింధు జన్మించింది ఎక్కడ? ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది? ఎంత చదువుకుంది? అనే వివరాలను సెర్చ్ చేయడం కామనే. కానీ, కొంత మంది ఆమె సామాజిక వర్గం ఏంటి? అని సెర్చ్ చేశారు. కాంస్య పతకం సాధించిన వెంటనే సెర్చ్ ఇంజిన్‌లో ఇలాంటి ప్రశ్నలను సంధించి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు. చాలా మంది నెటిజనాలు ఇలా చేయడం చూస్తుంటే వారి మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో? మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ పరిస్థితులపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సింధు మాత్రం తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతున్నది.