ఆంధ్రప్రదేశ్: క్రిష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోయిన ఘటన ఈరోజు ఉదయం 3.15నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది. పులిచింతల ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తుతుండడంతో నీటిని వదులుదామని గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ఊడిపోయి నీళ్ళలో పడిపోయింది. సాంకేతిక సమస్యలతో గేటు ఊడిపోయిందని అధికారులు చెబుతున్నారు. 16వ గేటు ఊడిపోయినందున అదనంగా లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.
ప్రస్తుతం ఎమర్జెన్సీ గేటు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నాం లోపు ఎమర్జెన్సీ గేటు ఏర్పాటు పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు. క్రిష్ణా నదీ పరీవాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎమర్జెన్సీ గేటు ఏర్పాటు త్వరగా పూర్తి చేస్తామని, కాబట్టి సహకరించాలని కోరుతున్నారు. వర్షాల ధాటికి అన్ని నదులు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టు నిండు కుండలను తలపిస్తున్నాయి. దాదాపు అన్ని నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి.