దేశాన్ని నడిపించే శక్తుల గురించి పూర్తి వివరం ఏదీ అందడం లేదు. బీజేపీని నడిపించే మోడీ, బీజేపీతో నడిచే యోగీ ఈ ఇద్దరిలో ఎవరు నంబర్ ఒన్ అన్న` మీమాంస ఒకటి ఎదురవుతోంది. యోగీ కన్నా మోడీనే బెటర్ అని కొందరు అంటుంటే, కాదు కాదు యోగీనే ఎడ్మిన్ లో బాగుంటారు అని ప్రచార సంబంధ కాంక్ష తక్కువగా ఉన్న సీఎంలలో ఆయనే బెస్టు అని కూడా అంటున్నారు ఇంకొందరు.ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. యూపీలో బీజేపీ దూసుకుపోతోంది.
ఇదే సమయంలో బీజేపీ కి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్ లో బాగుంది. బాగుంది అనే కన్నా పాలన వ్యవస్థను ఏర్పాటు చేసి నడిపే దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటిదాకా వెల్లడయిన ఫలితాలు అన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కి విజయ దరహాసాలు అందిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశానికి ఎట్టకేలకు మరో ప్రత్యామ్నాయం కూడా వచ్చింది. అంటే యోగీ మోడీ కేజ్రీ వీరితో పాటు కేసీఆర్ కూడా తనకు తాను ఓ ప్రత్యామ్నాయ శక్తిగా అభివర్ణించుకుంటున్నారు.
ఇక ఇదే సమయంలో మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. అలా అని ఆయనను తప్పు పట్టలేం. ఎందుకంటే కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాలు ఎదురు చూసిన అమెరికా లాంటి అగ్ర రాజ్యాల కన్నా మనం ఇవాళ కాస్తో కూస్తో బెటర్ గానే ఉన్నాం. ఉత్పత్తి రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే మోడీ చేసేది కన్నా చెప్పేది ఎక్కువ అన్న ఒక్క విచారకరమయిన అభిప్రాయాన్ని తన విషయమై వెల్లడి అయ్యేలా చేస్తున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల విషయమై సజావుగా నిర్ణయాలు వెలువరించలేక పట్టు కోల్పోతున్నారు.
ఇదే ఆయనకు ఇబ్బంది. అయితే జగన్ కు మాదిరిగా మోడీకి సలహాలరావులు లేకపోవడం చాలామంచి పరిణామమే! అదేవిధంగా ఈ సారి ప్రశాంత్ కిశోర్ ను మళ్లీ మోడీ నమ్ముకుంటే ఆశాజనక ఫలితాలు రావచ్చునేమో కానీ యోగీకి దీటుగా ఇక్కడ మోడీ యూపీ ప్రజల నమ్మకాన్ని అయితే పొందలేరు అన్నది ఓ వాస్తవం. అందుకే ఇకపై మోడీ ఇంకా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అదేవిధంగాయోగీ జాతీయ స్థాయి నాయకుడిగా రాణించాలి అంటే ఇప్పుడు ఆయనలో ఉన్న కొద్దిపాటి ఆవేశమో కోపమో పోవాలి. నియంతృత్వ పోకడలు కూడా పోవాలి. ఇదే సమయంలో కేజ్రీ కేసీఆర్ ఒకవేళ జట్టు కడితే ఢిల్లీతో సహా పంజాబ్ ఇంకా వీలుంటే కొన్ని చోట్ల మంచి ఫలితాలే అందుకోవచ్చు అని తెలుస్తోంది ఇవాళ్టి ఫలితాల సరళి నుంచి..
దేశానికి కాబోయే ప్రధాని యోగి ? #YogiAdityanath #BJPWinningUP #BJP4UP #BJP
— Manalokam (@manalokamsocial) March 10, 2022