బీజేపీ లాంటి పెద్ద పార్టీలలో యోగీ లాంటి లీడర్ల అవసరం ఎంతో ఉంది అని ఇవాళ మరో సారి నిరూపణ అయింది. ఓ విధంగా ఫలితాలు వస్తూ వస్తూనే కొత్త ట్రెండ్ కు నాంది ఇచ్చాయి. అంతేకాదు లెక్కింపు ప్రక్రియ రెండు గంటల్లోనే ఫలితాల వెల్లడి లో గెలుపు ఎవరిది అన్నది చాలా క్లియర్ గా వెల్లడి కావడం విశేషం.
యూపీ ఎన్నికల ప్రభావం ఫలితాల వివరం పై ఏపీలోనూ డిస్కషన్ ఉంది.మరి! యోగీని నడిపించింది ఎవరు? ప్రజలా లేదా పథకాలా? అన్నది కూడా చూడాలి. సుస్థిర పాలన, నమ్మకం అయిన ప్రగతి అన్నవి ఇవాళ ఆయన గెలుపునకు సహకరించిన విషయాలు అయి ఉండాలి.ఆ విధంగా యోగీ విజయవంతం అయ్యారన్నది ఇప్పటి నిజం.
మీదడి పోవడం కుమ్మేసుకోవడం రక్తాలు వచ్చేలా కొట్టేయడం అన్నవి సినిమాల్లో రాజకీయాల్లో కాదు. చేయాలనుకున్నది చేయాలి. చెప్పాలనుకున్నది చెప్పాలి. దాచాలనుకున్నది దాచాలి. అప్పుడే మంచి పేరు రావడం ఖాయం. మంచి పేరు రాకపోయిన పర్లేదు కానీ చెడ్డ పేరు అయితే అంత వేగంగా రాదు. యోగీ ఆదిత్య నాథ్ విషయంలో కూడా జరిగింది ఇదే! బీజేపీ మ్యానిఫెస్టోలో ఆకర్షణీయ పథకాలు పెద్దగా ఏమీ లేవు.ఆ మాటకు వస్తే మన జగన్ మాదిరిగానో లేదా చంద్రబాబు మాదిరిగానో
డైలాగులు కానీ ఉచిత పథకాల ప్రకటనలు కానీ పెద్దగా ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిల చదువుకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఒకటో రెండో పథకాలు మాత్రం ప్రకటించారని భావించాలి.ఇదే సమయంలో రైతులకు ఆయనేం చేస్తారో చెప్పారు.
ఇవన్నీ ఆయనకు సాయం చేశాయి.
దేశాన్ని కదిపి కుదిపేస్తున్న పరిణామాలన్నింటిలోనూ యోగీ ఉంటారు. మోడీ ఉంటారు. మోడీ కన్నాయోగీ మరింత బలమైన నేతగా ఉంటారు. అది నిజం! ఇందులో హిందుత్వ కార్డు ఉన్నా కూడా దానిని తప్పించి బీజేపీ రాజకీయం చేయడం తగని పని!
అయినా కూడా మోడీ కన్నా యోగీ జనాలకు నచ్చాడు.ఏదో మ్యాజిక్ చేశాడు అందుకే అతడు మ్యాజిక్ ఫిగర్ దాటాడు.దళితుల ఓట్లు, అగ్ర వర్ణాల ఓట్లు ఓ నాయకుడికి ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పాడు.ఈ గెలుపు బీజేపీది కాదు మోడీదీ కాదు అమిత్ షా దీ కాదు యోగీదే! ఇది క్లియర్ భయ్యా! డియర్ సర్ ఆల్ ద బెస్ట్ .. కంగ్రాట్స్ టు యూ