ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్ర బాబు ప్రభుత్వం ఉన్న సమయంలో.. ఈ పోటీ ఎక్కువ లేదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి అభివృద్ధిలో సంక్షేమ పథకాలు అమలులో తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసే కార్యక్రమాలే జగన్ చేస్తారు.. అనే ఒక వాదన కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పలు అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు జనాలు ఆకట్టుకున్నాయి.
అలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ మార్క్ పాలనను చూపిస్తు వచ్చారు. అయితే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై ప్రధానంగా ఉన్న వ్యతిరేకత.. ఉద్యోగాల భర్తీ. అయితే ఏపీలో జగన్ సర్కార్ ఉద్యోగాల భర్తీలో ఇప్పటికే వెనకంజలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వెనకంజలో ఉండగా.. కేసీఆర్ నేడు అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడంతో ఒక్క సారిగా.. నిరుద్యోగుల దృష్టిలో కేసీఆర్ హీరో అయిపోయారు.
ఒక్క తెలంగాణలోనే కాకుండా.. ఆంధ్ర ప్రదేశ్ లోనూ సీఎం కేసీఆర్ కు నిరుద్యోగులు పాల అభిషేకాలు చేస్తున్నారు. కేసీఆర్ చేసిన ఒక్క ప్రకటన తో రెండు రాష్ట్రాల్లో కేసీఆర్ హిట్ అయిపోయారు. అయితే కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటన.. జగన్ మెడకు చుట్టుకుంది. పక్క రాష్ట్రంలో భారీగా నోటిఫికేషన్లు వస్తున్నాయని.. ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఏంటి అని జగన్ ను నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్న జగన్ కు కొత్త తలనొప్పి తయారు అయింది.
ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ హిట్ జగన్ ఫట్ #TelanganaBudget2022 #TelanganaJobs #TelanganaWithKCR
— Manalokam (@manalokamsocial) March 9, 2022