బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మోదీకి మద్దతుగా మాట్లాడటంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై కంగనా స్పందించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాయని తెలిపారు. గ్యాంగ్స్టర్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పలు పార్టీలు తనకు టికెట్ ఇవ్వడానికి ప్రయత్నించాయని అన్నారు. అయితే తాను రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానని.. తన దృష్టంతా సినిమాలపైనే ఉందని.
This is to set the records straight for everyone who thinks I support Modi ji because I want to join politics,my grandfather has been congress MLA for consecutive 15 years,my family is so popular in politics back home that after Gangster almost every year I got offers (cont )1/2
— Team Kangana Ranaut (@KanganaTeam) August 15, 2020
నటిగా తన జీవితం గురించే ఆలోచన తప్పా, రాజకీయాల గురించి అసలు ఆలోచన లేదు అని తెలిపారు ఆమె. అలాగే ఈ సందర్భంగా తన తాత వరుసగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమంటూ.. ఇకనైనా ఈ ట్రోలింగ్లు ఆపితే మంచిది అని ఆమె తన ట్విటర్ లో పేర్కొన్నారు.